మాట తప్పిన కేసీఆర్ :నాయిని సంచలన వాఖ్యలు

మాట తప్పిన కేసీఆర్ :నాయిని సంచలన వాఖ్యలు

0
110

టిఆర్ఎస్ నేత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ తాను అడిగానని అయితే ఆ టికెట్ను ముఠా గోపాల్ కు ఇచ్చి గెలిపించుకున్నారు అని అన్నారు.

తనను మంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారని ఇప్పుడు కేసీఆర్ ఆ మాట కూడా తప్పారని మండిపడ్డారు. హోం మంత్రిగా పని చేసిన తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి తాను కూడా ఒనర్నేనని అన్నారు. ఈ పార్టీలోకి వచ్చిన వారు ఎప్పుడు దిగిపోతారో.. తెలియదని నాయిని నరసింహారెడ్డి ఘాటు వాక్యాలు చేశారు