దేశ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ మరింత దారుణంగా ఉంది, కాస్త ఆదమరిస్తే భారత్ ఇటలీని మించి పోతుంది అని వైద్యులు చెబుతున్నారు.. మన దేశంలో కూడా ప్రతీ 80 వేల మందికి ఓ వెంటిలేటర్ మాత్రమే అందుబాటులో ఉంది అని చెబుతున్నారు ..అందుకే పరిస్దితి ఆలోచించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు.. ఇంటి నుంచి వచ్చినా ఒక్కరు మాత్రమే రావాలి అని చెబుతున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా 15 స్టేట్స్ లాక్ డౌన్ ప్రకటించాయి. రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఇక మన దేశంలో ఏ ఒక్క అంతర్జాతీయ విమానానికి అనుమతి లేదు.. కేవలం బయలు దేరిన విమానాలు మాత్రమే నిన్నటి వరకూ ల్యాండ్ అయ్యాయి, కొత్తవి ఎక్కడ టేకాఫ్ తీసుకున్నా మన దేశంలో మాత్రం లాండ్ అయ్యే పరిస్దతి లేదు అంతర్జాతీయ విమాన సర్వీలసులు బంద్ అయ్యాయి.
తాజాగా డొమిస్టిక్ ఎయిర్ లైన్స్ కూడా నిలిపేశారు, ఈ నెల 24 అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని నిశ్చయించారు. దీంతో దేశీయ రూట్లలో తిరిగే ప్రయాణికుల విమానాలు నిలిచిపోనున్నాయి. అయితే, రవాణా విమానాలకు ఈ నిర్ణయం వర్తించదు. ఆ ఉద్యోగులకి కూడా సెలవులు ఇవ్వనున్నారట.