ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా బాధలో ఉంది.. అయితే ఈ సమయంలో మరో గండం ఉంది అనే వార్త రెండు రోజులుగా మీడియాలో తెగ వినిపిస్తోంది… అదే చైనా రాకెట్… నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొస్తున్న చైనా రాకెట్ ఎక్కడ పడుతుందో తెలియక ప్రపంచం మొత్తం ఆందోళనగా ఉంది. సైంటిస్టులు అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ మీడియా దీనిని హైలెట్ చేస్తోంది.
దీనిపై స్పందించింది చైనా..ఆ రాకెట్తో ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ మాడిమసైపోతుందని ఎలాంటి ఆందోళన వద్దు అని తెలిపింది. అసలు ఈ రాకెట్ ఏమిటి అంటే చైనా సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రానికి గత నెల 29న కోర్ మాడ్యూల్ను విజయవంతంగా మోసుకెళ్లినలాంగ్ మార్చ్5బి’ రాకెట్ ఆ తర్వాత నియంత్రణ కోల్పోయింది.
సుమారు ఇది గంటకు 18 వేల మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తోంది. వేల టన్నుల బరువున్న ఈ రాకెట్ భూమిపై పడితే జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది అని సైంటిస్టులు అన్నీ దేశాల్లో మాట్లాడుతున్నారు, అయితే అది భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది, దాని వేగం ప్రకారం అది ఎక్కడ పడుతుందో. ఈరోజు భూమిని తాకే అవకాశం ఉంది అని అంటున్నారు.