నెల్లూరు వైసీపీలో మొదలైన మూడు ముక్కలాట..

నెల్లూరు వైసీపీలో మొదలైన మూడు ముక్కలాట..

0
78

గ్రామ స్థాయిలో ఒకే పార్టీకి చెందిన కార్యకర్తలు గ్రూప్ రాజకీయాలు చేసుకుంటుంటారు… ఇది సర్వసాధారణం ఆయా పరిస్థితులను బట్టి మళ్లీ కలిసిపోతుంటారు… కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గ్రూప్ రాజకీయాలు చేసుకుంటున్నారు…

ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయట… బావా బావమరిది శ్రీధర్ రెడ్డి కాకాణీ ఒక్కరే గ్రూప్ రాజకీయాలు చేసుకున్నారని అనుకున్నారు… కానీ చాలామంది నేతలు ఒకరంటే ఒకరు గిట్టనివారు ఉన్నారు… రాజకీయ ఉద్దండులు ఉన్న ఈ జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ కు మేకపాటి గౌతమ్ రెడ్డిలకు మంత్రి పదవి ఇవ్వడంపై చాలామంది నేతలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు…

వైసీపీ అధికారంలోకి వచ్చి సుమారు 4 నెలలు కావస్తున్నా ఒక్కసారి కూడా సమావేశం అవ్వలేదు… సీనియార్టీలో తమకన్నా జూనియార్లు అయిన వీరిని ఎందుకు కలవాలనుకున్నారో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం ఒకరినొకరు కలవడంలేదట.