ఈ కరోనా సమయంలో ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఎంత మంది భక్తులు వస్తారు అనేది చెప్పలేము అంటున్నారు అధికారులు.. ఈ ఏడాది శబరిమలకు వచ్చే భక్తులు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే అని కేరళ సర్కార్ స్పష్టం చేసింది.
అయితే స్వామిని దర్శించుకోలేదు అని బాధ అక్కర్లేదు, స్వామి ప్రసాదాన్ని మీకు నేరుగా ఇంటికి అందించేందుకు పోస్టల్ శాఖ సిద్దం అయింది. శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం పేరుతో రూ. 450 చెల్లిస్తే ప్రసాదం కిట్ను నేరుగా భక్తుల ఇంటికి డెలివరీ చేస్తారు.
మరి అయ్యప్ప స్వామిప్రసాదం కిట్లో ఏమి ఉంటాయి అనేది చూద్దాం అరవణ, నెయ్యి, పసుపు, విభూదితోపాటు పలు ఇతర వస్తువులు ఉంటాయి.ఇక బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి, స్పీడ్ పోస్టు ద్వారా ఈ ప్రసాదాన్ని భక్తులకు అందించనుంది. భక్తులు చెల్లించే రూ. 450లో శబరిమల ట్రస్ట్కు రూ.250 వెళుతుంది, ఇక 200 పోస్టల్ శాఖకు వెళతాయి. భక్తులు ఇచ్చిన అడ్రస్ కు మూడు రోజుల్లో దీనిని అందచేస్తారు.