ఎమ్మెల్యే రోజా చేసిన పనికి గ్రేట్ మేడం అంటున్న నెటిజన్లు

ఎమ్మెల్యే రోజా చేసిన పనికి గ్రేట్ మేడం అంటున్న నెటిజన్లు

0
85

వైసీపీ ప్రభుత్వం పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటోంది.. వారికి మంచి విద్య అందించాలి అని భావిస్తున్నారు సీఎం జగన్ ..అందుకే స్కూల్లో ఇంగ్లీష్ విద్య స్టార్ట్ చేస్తున్నారు… అలాగే అన్నీ మౌళిక వసతులు స్కూల్లో ఏర్పాటు చేయాలి అని అధికారులకి ఆదేశాలు జారి అవుతున్నాయి.. ఇటీవల 15 వేల రూపాయల అమ్మ ఒడి అందించారు.

తాజాగా జగనన్న గోరుముద్ద కార్యక్రమం ఏపీ అంతా జరుగుతోంది, ఈ సమయంలో వైసీపీ నేతలు అందరూ కూడా స్కూల్స్ కు వెళ్లి వారికి అందిస్తున్న భోజనం గురించి తెలుసుకుంటున్నారు.. పిల్లలని అడిగి ఫుడ్ ఎలా ఉంది అని అభిప్రాయం తీసుకుంటున్నారు… తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా జగనన్న గోరుముద్ద కార్యక్రమంలోపాల్గొన్నారు.

తన నియోజక వర్గం నగరిలోని ఓ పాఠశాలలో ఆమె పిల్లలకు పెడుతోన్న భోజనంలో నాణ్యతపై తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆమె స్కూల్ లో సందర్శించడం వారికి అన్నం వడ్డించి వారి బాగోగులు అడిగిన వీడియో షేర్ చేశారు.. దీనిపై నెటిజన్లు ఆమెకి ఫిదా అయ్యారు మీరు గ్రేట్ మేడం అంటున్నారు.