ఏపీ కొత్త గవర్నర్ హరిచందన్ తిరుమలకు చేరుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలసి భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన… అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు టీటీడీ ఈవో సింఘాల్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రేపు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
తిరుమల చేరుకున్న ఏపీ కొత్త గవర్నర్
తిరుమల చేరుకున్న ఏపీ కొత్త గవర్నర్