Breaking News- సిద్దిపేటకు నూతన కలెక్టర్

0
73

తెలంగాణ: సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావుకు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హనుమంతరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సిద్దిపేట కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట్రామరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో వెంకట్రామిరెడ్డికి స్థానం ఇవ్వనున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారిగా ఉన్న వెంకట్రామిరెడ్డి ఇటీవల వరి పంట విషయంలో చేసిన వ్యాాఖ్యలు వివాదాస్పదమయ్యాయిన సంగతి తెలిసిందే.