ధనవంతులు మార్కెట్లోకి వచ్చిన కొత్తకార్లు వెంటనే కొంటారు.. తమ గ్యారేజీలో పెట్టిస్తారు, రోడ్లపై పరుగులు తీస్తాయి, ఇక మన దేశంలో చాలా మంది ప్రముఖులు వ్యాపారులు సెలబ్రెటీలు ఇలా విదేశాల నుంచి కూడా లగ్జరీ కార్లు తెప్పించుకుంటారు అనే విషయం తెలిసిందే, అయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దగ్గర ఉన్నన్ని కార్లు మన దేశంలో ఎవరి దగ్గర లేవు.. దాదాపు వందల కార్లు వరకూ వారి గ్యారేజీలో ఉంటాయి అంటారు.
ఈ ఏడాది ప్రారంభంలోనే ముకేశ్ అంబానీ గ్యారేజీలోకి 3అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీలు డెలివరీ అయ్యాయి.
రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కూడా వచ్చి చేరింది ఆయన ఇంటికి… బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ ధర రూ.8.20 కోట్లుగా ఉంటుంది, ఖర్చులు అన్నీ కలిపి పది కోట్లు అవుతుంది.
ఈ కారులో 6.75 లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్-టర్బో వీ12 ఇంజన్ ఇందులో ఉంది. నాలుగు సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది , ఆయన అభిరుచికి తగ్గట్లు ఈ కారు చేయించుకున్నారు.. ఈకారుకి మరో స్పెషాలిటి ఏమిటి అంటే ఎడారి, అడవి, బురద, కొండ, గుట్టలు ఇలా ఎలాంటి ప్రాంతంలోనైనా దూసుకుపోతుంది.బెంట్లీ బెంటెగా, మసెరటి లెవంటి
రోల్స్ రాయిస్ ఫాంటమ్-8, ఫాంటమ్ డీహెచ్సీ ..బీఎండబ్ల్యూ ఐ8, ఫెరారీ 812, మెక్లారెన్ 520ఎస్ స్పైడర్, లాంబోర్గినీ అవెంటడర్ ఎస్ రోడ్‌స్టర్, ఫెరారీ 488 జీటీబీ, ఫెరారీ పోర్టోఫినో, యాస్టన్ మార్టిన్ డీబీ11 ఇలాంటి ఖరీదైన కార్లు చాలా ఉన్నాయి.
|
|
అంబానీ గ్యారేజీకి కొత్త రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్బ్యాడ్జ్ దీని స్పెషాలిటీ ధర ఎంతంటే
-