బైక్ నడిపే సమయంలో కచ్చితంగా హెల్మెట్ ధరించాలి వెనుక ఉన్న వారు కూడా హెల్మెట్ ధరించాలి అనే రూల్ వచ్చింది సిటీలో, అయితే క చ్చితంగా లైసెన్స్ , ఆర్సీ, ఇన్సూరెన్స్ , ఉండాల్సిందే, లేకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సిందే, బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో ఇప్పుడు వాహనదారులు ఇవి కచ్చితంగా పాటించాల్సిందే.
ఇలాంటి సమయంలో బెంగళూరులో కీలక నిర్ణయం తీసుకున్నారు అక్కడ అధికారులు…రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెల్మెట్ పెట్టుకోని ద్విచక్రవాహనాదారుల లైసెన్స్ను మూడు నెలల పాటు సస్పెండ్ అవుతుందంటూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఎక్కడైనా అధికారులకి పట్టుబడితే హెల్మెట్ లేకపోతే వెంటనే మీ లైసెన్స్ మూడు నెలలు రద్దు చేస్తారు, గతంలో ఓసారి హెచ్చరించేవారు ఇక అలాంటివి ఏమీ లేదు, మూడు నెలలు రద్దు అవుతుంది, ఈ సమయంలో లైసెన్స్ లేకుండా తిరిగితే కేసు నమోదు చేస్తారు.