బ్రేకింగ్ – ఏపీకి వ‌చ్చే వారికి కొత్త క్వారంటైన్ రూల్స్ – ఇది లేక‌పోతే నో ఎంట్రీ

బ్రేకింగ్ - ఏపీకి వ‌చ్చే వారికి కొత్త క్వారంటైన్ రూల్స్ - ఇది లేక‌పోతే నో ఎంట్రీ

0
80

ఏపీలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న వేళ చాలా సీరియ‌స్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు, బ‌య‌ట వ్య‌క్తులు ఇత‌ర రాష్ట్రాల నుంచి ఏపీకి ఎవ‌రు రావాలి అన్నా క‌చ్చితంగా ఈ పాస్ తీసుకోవాల్సిందే, స్పంద‌న‌లో రిజిస్ట‌ర్ అయి క‌చ్చితంగా ఈపాస్ తోనే రావాలి లేక‌పోతే ఎవ‌రిని అనుమ‌తించ‌రు..తాజాగా ఏపీ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఖచ్చితంగా పాటించాలి. దుబాయ్ గ‌ల్ఫ్ అయితే ఏడు రోజులు క్వారంటైన్ లో వారు ఉండాల్సిందే, వారికి టెస్ట్ లు చేసిన త‌ర్వాత మాత్ర‌మే ఇంటికి అనుమ‌తిస్తారు.

ఇక దేశీయ విమానాల్లో ప్ర‌యాణించే వారికి అంద‌రిలో కొత‌మందిని అంటే , రాండ‌మ్ గా 10 శాతం టెస్టులు చేస్తారు. వారు క‌చ్చితంగా 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి.

రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులలో 10శాతం మందికి కోవిడ్ పరీక్ష చెయ్యడం జరుగుతుంది. వీరికి రైల్వేస్టేషన్ బయటనే స్వాబ్ టెస్ట్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.
వారు క‌చ్చితంగా 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి.ఎక్క‌డిక‌క్క‌డ చేతికి 14 రోజులు హోమ్ క్వారంటైన్ స్టాంప్ అనేది వేస్తారు.

వివిధ రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గము ద్వారా రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులకి సరిహద్దుల్లోనే స్వాబ్ టెస్ట్ తీసుకుంటారు. వీరు తప్పనిసరిగా 14రోజులు హొమ్ క్వారంటైన్ లో ఉండాలి. అలాగే కార్లు సొంత వాహ‌నాల్లో వ‌స్తే ,వారు ఈపాస్ తీసుకోవాలి స్పంద‌న వెబ్ సైట్లో… 100% ఈ-పాస్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే అనుమతించడం జరుగుతుంది.