ఈ రోజుల్లో బ్యాంకుకు వెళ్లి చేసే ట్రాన్సాక్షన్లు తగ్గాయి… అంతా ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి, ఇదే సమయంలో కొన్ని చోట్ల మోసాలు పెరిగిపోతున్నాయి, అయితే ఇలాంటి సమయంలో ఆర్బీఐ అలర్ట్ చేస్తోంది, అంతేకాదు ఖాతాదారులకి బ్యాంకులు కూడా అలర్ట్ మెసేజ్ లు చేస్తున్నాయి, జాగ్రత్తలు చెబుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఆన్ లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు క్రెడిట్, డెబిట్ కార్డులకు మరింత రక్షణ కల్పించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గైడ్ లైన్స్ ను రూపొందించింది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి ఈ రూల్స్ రానున్నాయి.
ఇక కార్డుల విషయంలో మరింత సెక్యూరిటీ ఉండనుంది..ఇకపై క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్, ఆన్ లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వాడాలంటే, ముందస్తు అనుమతి తప్పనిసరి.
ఇక మీరు బ్యాంకు నుంచి పొందే డెబిట్ క్రెడిట్ కార్డులు కేవలం పెట్రోల్ బంకుల్లో, అలాగే ఏటీఎంలలో
పాయింట్ ఆఫ్ సేల్స్ దగ్గర స్వైప్ చేయడానికి పనిచేస్తాయి.
రిస్క్ తీసుకునే కస్టమర్లకు వారి నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు ఖాతాను జత చేస్తారు. మీకు కార్డుకి ఎంత పరిమితి అయినా పెట్టుకోవచ్చు, మీరు వాడుతున్న కార్డు పరిమితి దాటితే వెంటనే అలర్ట్ మెసేజ్ సందేశం వస్తుంది.
కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, ఎన్ఎఫ్సీ, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగానూ నిషేధించుకోవచ్చు. కార్డులను విదేశాల్లో వాడుకోవాలనుకున్నా బ్యాంకు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. మొత్తం ఏ ట్రాన్సక్షన్ జరగకుండా ఆపాలి అని అనుకున్నా బ్యాంకుకు వెళ్లి ఆప్షన్ పెట్టుకోవచ్చు..కాంటాక్ట్ లెస్ లావాదేవీల పై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, సో దీని వల్ల మోసాలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.