బ్రేకింగ్ – అక్టోబర్ 1 నుంచి వాహనదారులకి కేంద్రం కొత్త రూల్స్

బ్రేకింగ్ - అక్టోబర్ 1 నుంచి వాహనదారులకి కేంద్రం కొత్త రూల్స్

0
92

బైక్ కారు ఏ వాహనం నడిపేవారు అయినా జాగ్రత్తలు తీసుకోవాలి, బైక్ పై హెల్మెట్ ఇద్దరూ ధరించాలి, కారుసీటు బెల్ట్ ధరించాలి ఇది పక్కాగా అమలు చేస్తున్నారు దేశంలో,వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వాహనం నడిపే వారు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ ఉండాలి, అయితే అప్ డేట్ చేయించింది ఉండాలి.

గడువు ముగిసింది ఉంటే భారీ ఫైన్లు పడతాయి.. నిబంధనల ప్రకారం అప్ డేట్ చేసుకోవాలి
అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా నిబంధనలు కేంద్రప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. .
కొత్తగా జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సు లకు మైక్రోచిప్ ఉంటుంది. క్యూఆర్ కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్లు కూడా ఉంటాయి.

ఇవన్నీ కొత్త కార్డుల్లో రానున్నాయి,అంతే కాదు యూనిఫాం వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయనున్నారు.ఆర్సీలు కూడా కాగితాలు కాకుండా కార్డుల రూపంలో ఇస్తారు, డేటా చిప్ ఉంటుంది, సెంట్రలైజ్ చేసిన ఈ డేటా పదేళ్ల వరకు ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కొత్త ఆర్సీకి యజమాని పేరు ముందు భాగంలో ఉంటుంది. వెనుకభాగంలో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఈ చిప్ ద్వారా ఆ వాహనం యజమాని డీ టెయిల్స్ ఫైన్లు అన్నీ సులువుగా తెలుస్తాయి.