మద్యం తాగి వాహనాలు నడిపే వారికి ఇక భారీ ఫైన్లు కొత్త రూల్స్

-

హైదరాబాద్ నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారికి ఇక పోలీసులు చుక్కలు చూపించనున్నారు, ఇష్టం వచ్చినట్లు ఫుల్లుగా మద్యం తాగి బైక్ కారు నడిపితే ఇక జైలుకే.. అంతేకాదు యాక్సిడెంట్లకు కారణం అవుతున్న వారిని ఇక వదిలేది లేదు అంటున్నారు పోలీసులు..రోజులో 24 గంటల్లో ఎవరైనా తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. వారు పని చేసే ఆఫీసులకు ఈ సమాచారాన్ని చేరవేయనున్నారు.

- Advertisement -

అంతేకాదు వారికి ఒకేసారి 10 వేల ఫైన్ విధిస్తారు, అంతేకాదు బైక్ కారు సీజ్, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు, ఇక ఆరు నెలల జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇలా మొదటి సారి దొరికిన వారికి ఈ శిక్షలు ఫైన్లు ఉంటాయి.

ఇలానే రెండోసారి పట్టుబడితే రూ. 15 వేల ఫైన్ తో పాటు రెండేళ్ల జైలు, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు, సో ఇకపై మందుబాబులు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే ఈ కఠిన శిక్షలు తప్పవు.. నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ను అధికారులు మళ్లీ పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇటీవల ఇలా తాగి వాహానాలు నడిపి కొందరు అమాయకుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్న ఘనటలు ఎన్నో చూశాం.. ఇది మంచి నిర్ణయం అంటున్నారు ప్రజలు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...