ఇప్పుడు అంతా సెల్ ఫోన్లు ఉన్నాయి, అయితే ఇప్పుడు మొబైల్స్ తో పాటు ల్యాండ్ లైన్ కూడా మాట్లాడేవారు చాలా మంది ఉంటున్నారు, ఇక ఆఫీసుల్లో కూడా ఇప్పటీకీ ఈ ల్యాండ్ లైన్ సర్వీసులు ఉన్నాయి.. ఇక మీరు ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ కి కాల్ చేస్తున్నారా..
అయితే ఈ విషయం తెలుసుకోవాలి. ఇకపై ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్స్‌కు కాల్ చేస్తే ముందు 0 అంకెను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. అంటే 9999999999 నెంబర్‌కు ల్యాండ్‌లైన్ నుంచి కాల్ చేయాలంటే 09999999999 ఇలా నెంబర్ ఎంటర్ చేయాలి అప్పుడు మాత్రమే ఇలా కాల్ వెళుతుంది.
మీరు ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తే ఇకపై 11 అంకెలతో కాల్ డయల్ చేయాలి. 2020 నవంబర్ లో ఈ కొత్త రూల్ వచ్చింది, అయితే ఈ రోజు నుంచి దీనిని అమలులోకి తీసుకువచ్చారు. కస్టమర్లు ఈ రూల్ తెలుసుకోండి.