రామోజీరావును కలిసిన రేవంత్ రెడ్డి

0
114

నూతనంగా ఎన్నికైన టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావును కలిశారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే అని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

ఇప్పటికే రేవంత్ రెడ్డి మీడియా అధినేతలైన బిఆర్ నాయుడు (టివి5) వేమూరి రాధాకృష్ణ (ఆంధ్రజ్యోతి)లను కలిసి వారి ఆశిస్సులు తీసుకున్నారు. తాజాగా రామోజీరావును సైతం కలిసి ఆశిస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు మల్ రెడ్డి రంగారెడ్డి, మల్ రెడ్డి రాం రెడ్డి, చిలకం మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

నిన్న కర్ణాటక వెళ్లిన రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పో్ర్ట్ నుంచి నేరుగ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీని కలిసిన తర్వాత బయటకొచ్చారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్కలను కూడా మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు సమాచారం.

రేపు రేవంత్ రెడ్డి నూతన పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు.