కేసిఆర్ పై రేవంత్ రెడ్డి దండయాత్ర అక్కడి నుంచే స్టార్ట్ : రేణుకా చౌదరి

0
107

కొత్తగా ఎంపికైన తెలంగాణ పిసిసి నేతలు హైదరాబాద్ లో శుక్రవారం మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిని కలిశారు. ఆమె ఆశిస్సులు తీసుకున్నారు. ఆమెను కలిసిన వారిలో నూతన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావ్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడారు. ఆమె మాటలు…

పీసీసీ టీం లో సమర్దవంతమైన నాయకులు ఉన్నారు. ఈ కమిటీ కాంగ్రెస్ స్వార్దానికి కాదు..రాష్ట్ర ప్రజల కోసమే.

దేశానికి గొప్ప గొప్ప మాటలు చెప్పే ప్రధాని, గ్యాస్ ధరలు పెంచుతున్నారు.

కుటుంబ భాధ్యతలు తెలిసిన ప్రధాని అయితే.. నిత్యవసర ధరల పెరిగితే ఆ కుటుంబం పడే ఇబ్బంది ఏంటో తెలిసేది.

కోవిడ్ మేనేజ్మెంట్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయి.

ప్రభుత్వం ఇచ్చే పన్షన్ లో సగం డబ్బు గ్యాస్ కోసం వెచ్చించాల్సి వస్తుంది. ఇక కుటుంబం గడిచేది ఎలా?

రూపాయి విలువ తగ్గతుంది.. మరోవైపు మిత్ర దేశాలు శత్రు దేశాలుగా మారుతున్నా..చైనా కవ్వింపు చర్యలు చేపడుతున్నా.. ప్రధాని నోరు మెదపడం లేదు.

రేవంత్ రెడ్డి పీసీసీ గా ప్రమాణ స్వీకారం తర్వాత… కేసీఆర్ పై దండయాత్ర ఖమ్మం నుంచే ప్రారంభం అవుతుంది.

మా పార్టీ డోర్ లు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మా ఎమ్మెల్యే లు తిరిగి పార్టీలోకి వస్తారు.

పార్టీ లో చేరుతామంటూ చాలా ఫోన్ లు వస్తున్నాయి.