కర్ణాటక మంత్రి రమేశ్ జర్కిహోళికి సంబంధించి రాసలీలల వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.. మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు.. రాజకీయంగా ఇది పెద్ద దుమారం రేపింది, అయితే
తాజాగా మరో విషయం బయటకు వచ్చింది..ఆ వీడియో క్లిప్పింగుల్లో రమేశ్ జర్కిహోళి సీఎం యడ్యురప్ప పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు కన్నడమీడియాలో ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు సీఎం యడ్యురప్ప అవినీతి పరుడు అని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై ప్రశంసలు కురిపించడం ఆ రాసలీలల వీడియోలో కనిపించింది, ఆ మహిళతో ఈ మాటలు అన్నట్లు జాతీయ మీడియాలో తెలిపింది.
దీనిపై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ఇక సీఎం ఎంత అవినీతి పరుడో ఏకంగా మంత్రి స్వయంగా చెప్పారు అని.. దీనికి సీఎం సమాధానం చెప్పాలి అని అన్నారు, ఇక బీజేపీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. బంతి ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉంది అన్నారు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ .