Breaking news- మందుబాబులకు న్యూ ఇయర్ షాక్..మార్గదర్శకాలు జారీ చేసిన హైదరాబాద్ సీపీ

New Year shock for Mandubabs..Hyderabad CP issued guidelines

0
88

తెలంగాణలో న్యూఇయర్‌ వేడుకలకు సంబంధించి మార్గదర్శకాలను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ జారీ చేశారు.

రెండు డోసుల టీకా తీసుకున్న వారినే వేడుకులకు అనుమతించాలని స్పష్టం చేశారు. వేడుకల్లో మాస్కు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు.

వేడుకల్లో భౌతికదూరం పాటించేలా, సిబ్బందికి 48 గంటల ముందు కొవిడ్‌ పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు.

మరోవైపు బహిరంగ వేడుకల్లో డీజేకు అనుమతి లేదని, ధ్వని కాలుష్యంపై ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మద్యం సేవించి వాహనం నడిపితే 6 నెలల జైలుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తామన్నారు.