తదుపరి దలైలామా ఎవరో తెలుసా ? ఆరోజు ప్రకటన వస్తుందా

తదుపరి దలైలామా ఎవరో తెలుసా ? ఆరోజు ప్రకటన వస్తుందా

0
102

టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా చాలా మందికి మార్గదర్శిగా ఉంటారు.. శాంతికి గురువుగా ఆయనని చెబుతారు
ఎలాంటి విద్వేషాలకు పోకుండా ఉండేది బౌద్ద మతం అని విశ్వసిస్తారు.. తాజాగా టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు.

కమ్యూనిస్టు చైనా దగ్గర తుపాకులు, ఆయుధాలు ఉంటే తమ దగ్గర సత్యం ఉందని టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా అన్నారు. ఆయుధ శక్తి మీద సత్యమే గెలుస్తుందని తెలియచేశారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన బీహార్‌లోని
బుద్ధగయలో మీడియాతో మాట్లాడారు, మన ప్రపంచంలో బౌద్దులు ఎక్కువ ఉన్నప్రాంతంగా చైనా కూడా ఉందని, అక్కడ బౌద్దులు చాలా మందిలో మార్పు వచ్చింది అని అన్నారు.

తదుపరి దలైలామా ఎవరనే విషయంపై ఆయన స్పందిస్తూ.. ఈ విషయంపై అంత తొందర ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు తనకు 85 ఏళ్లని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు. .వచ్చేనెల 6న జరిగే ఓ కార్యక్రమంలో దాదాపు 50,000 మంది బౌద్ధులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ సమయంలో ఆయన తదుపరి బాధ్యతలు తీసుకునేది ఎవరో, దలైలామా ఎవరో ప్రకటిస్తారు అని కొందరు అంటున్నారు.