దేశవ్యాప్తంగా NIA రైడ్స్..వైర్ లెస్ కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం

0
100

ప్రస్తుతం దేశవ్యాప్తంగా NIA (national investigation agency) దాడులు కొనసాగుతున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) టార్గెట్ గా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో NIA అధికారులు చేసిన దాడుల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా నేడు (శుక్రవారం) తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వాలినొక్కం గ్రామంలో అధికారులు సోదాలు జరిపారు.

ఈ రైడ్స్ లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) రామ్ నాడ్ వెస్ట్, రాష్ట్ర అధ్యక్షుడు బరాక్ అబ్దుల్లా ఇంట్లో వైర్ లెస్ కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో లోరెన్స్ LRH -80, ఫ్లోటింగ్ హాండెల్డ్ విహెచ్ఎఫ్ తో పాటు జిపిఎస్ కూడా ఉన్నాయి. దీనితో అబ్దుల్లాను అధికారులు అరెస్ట్ చేశారు. అయితే పట్టుబడిన పరికరాలు సముద్రతీరంలో నావిగేషన్ కోసం ఉపయోగపడుతాయని, వీటితో సముద్ర తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

NIA, ED (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్), వివిధ రాష్ట్రాల పోలీస్ బలగాలు ఈ ఆపరేషన్ ను సంయుక్తంగా నిర్వహించాయి. ఈ ఆపరేషన్ లో 13 రాష్ట్రాలలోని 100 ప్రాంతాల్లో రైడ్స్ చేసి PFI నాయకులతో సహా 105 మందిని అరెస్ట్ చేశారు. కాగా వీరి అరెస్ట్ కు నిరసనగా కేరళలో 12 గంటలు బంద్ కు పిలుపునిస్తున్నట్లు PFI తెలిపింది.