దిశ ఘటన గురించి ఎంత మంది చర్చించుకున్నారో తెలిసిందే ..ఆ నలుగురు దుర్మార్గులని ఉరి తీయాలి అని కోరింది సమాజం.. అయితే ఇలాంటి దారుణమైన ఘటన గతంలో నిర్భయకు జరిగింది. ఆమెని అత్యంత దారుణంగా చంపేశారు.
కాని ఆ దోషులకి మాత్రం శిక్ష పడలేదు.
తాజాగా నిర్భయ దోషులను ఈ నెల 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పు ఇచ్చింది, దీనిపై మహిళాలోకం ఆనందంగా ఉంది, నిర్బయకు ఇన్నాళ్లకు న్యాయం జరిగింది అని చెప్పుకుంటున్నారు.. దేశ వ్యాప్తంగా నిర్బయ తల్లికి అందరూ భరోసా దైర్యం కలిగిస్తున్నారు, ఆమె పోరాటం ఫలించింది అంటున్నారు, అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి వారి ఉరి పై స్పందించారు.. సోషల్ మీడియాలో .
విజయశాంతి ఏమన్నారో చూస్తే
నిర్భయ విషయంలో కోర్టు ద్వారా వచ్చిన తీర్పు అయినా.. దిశ విషయంలో ప్రజా ఆగ్రహజ్వాలల నుండి ప్రకృతి విధించిన శిక్ష అయినా.. స్త్రీ మూర్తి మనస్ఫూర్తిగా అభినందించ తగినవే… మన భారతదేశంలో న్యాయం, దైవం ఉన్నాయని నమ్మకం కలిగించేవే. ఆడబిడ్డలు, బిడ్డల తల్లులు క్షేమంగా, ధైర్యంగా బతికే సమాజం కోసం ప్రతి భారతీయ హృదయం నిజాయితీతో తల్లడిల్లుతూ… వ్యవస్థలను విశ్వసిస్తూ… పంచుకుంటున్న ఉద్వేగం ఈ అభిప్రాయం. అని సోషల్ మీడియాలో తెలియచేశారు.