నిర్మలా సీతారామన్‌తో జగన్‌ భేటీ

నిర్మలా సీతారామన్‌తో జగన్‌ భేటీ

0
88

హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆమెతో జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేక ఆర్థిక సాయం అందివ్వాలని ఆయన కోరినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న రూ.5వేల కోట్ల నిధులు కూడా విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను సీఎం కోరారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న నవరత్నాల పథకాలకు ఆర్థిక సాయం అందించాలని జగన్‌ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయిన సీఎం.. బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.