నీతా అంబానీ మన దేశంలో ప్రతీ ఒక్కరికి తెలిసిన ఆమె, ముఖేష్ అంబానీ సతీమణి, అంతేకాదు మంచి నృత్యకళాకారిణి అని చాలా మందికి తెలుసు, ఇక తను ప్రత్యేకంగా ఉంటారు, ఏ విషయంలో అయినా అనుకున్నది అనుకున్నట్లు చేస్తారు, ఇంటిని చక్కబెడుతూ సమాజ సేవ రిలయన్స్ కంపెనీ నుంచి సేవలు చేయడంలో ఆమె ముందు ఉంటారు.
అయితే ఆమెకి మొత్తం ముగ్గురు సంతానం , పిల్లల విషయంలో బాగా కేరింగ్ గా ఉండేవారు నీతా అంబానీ, ఇక
ముఖేష్ తండ్రి ధీరూబాయ్ అంబానీ..నీతా డాన్స్ చూసి నచ్చి, తన ఇంటి కోడలిగా చేసుకున్నారు. ఇక ముఖేష్ కు ఆమె నచ్చడంతో ఇద్దరూ 1985 మార్చి 8 న పెళ్లి చేసుకున్నారు.
ఇక ఆమె పిల్లల పెంపకంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు, ధనవంతుల బిడ్డలు అని విచ్చలవిడిగా నగదు ఇచ్చి వారికి ఖర్చులకి ఇచ్చేవారు కాదట, ప్రతి శుక్రవారం వారికి 5 రూపాయలు మాత్రమే ఇచ్చేది..ఓ రోజు చిన్న కొడుకు ఎక్స్టా గా 5 రూపాయలు అడిగాడట..ఆమె ఇవ్వలేదట, అందరూ అంబానీ కొడుకువి డబ్బులు లేవా అని అనేవారట, ముఖేష్ బాధపడినా, పిల్లల విషయంలో ఆమె మాటే నెగ్గేదట, పిల్లలకి విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వకూడదు అని ఆమె పాలసీ …అలాగే ఆమె పిల్లలని పెంచారు…ఇక ఫ్యామిలీ సభ్యులు అందరూ ఇంటిలో ఉంటే అందరూ కలిసి భోజనం చేస్తారు, అంత క్రమశిక్షణతో పిల్లలని పెంచారు ఆమె.