నిత్యం పని చేస్తున్న పారిశుధ్యకార్మికుడికి ప్రజలు ఏం ఇచ్చారంటే

నిత్యం పని చేస్తున్న పారిశుధ్యకార్మికుడికి ప్రజలు ఏం ఇచ్చారంటే

0
83

ప్రపంచం అంతా కరోనాతో భయపడిపోతోంది, ఈ సమయంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి అందరూ కలిసి ముందుకు సాగుతున్నారు… దాదాపు రెండు వందల దేశాలకు ఇది పాకేసింది.. అయితే కరోనా వైరస్ ఇంతలా విజృంభిస్తున్న వేళ డాక్టర్లు పోలీసులు నర్సులు పారిశుద్య సిబ్బంది చేస్తున్న సేవలు ఎవరూ వెలకట్టలేనివి.

ఈ నేపథ్యంలో ఒక మనిషిన మరో మనిషి తాకాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి కష్ట కాలంలో తన విధులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడిపై ప్రజలు పూల వాన కురిపించారు. నిత్యం ఇంటి దగ్గరకు వచ్చి అంతా శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడిపై పూలవర్షం కురిపించిన స్థానికులు, అతని మెడలో డబ్బుల హారాలను వేసి, అతని సేవలను కొనియాడారు.

పంజాబ్ లో ఓ చెత్త కార్మికుడు తన రిక్షాతో రావడం… చెత్త సేకరించి తీసుకు వెళ్లడం చూసి అక్కడి ప్రజలు సంతోషంతో అతనిని మెచ్చుకుంటూ పూల వాన కురిపించారు. అంతేకాదు అతని సేవలకు డబ్బులు
ఇచ్చారు.. డబ్బు దండ వేశారు చప్పట్లతో అతనిని అభినందించారు