నీతీశ్​ కుమార్​ సర్కార్​ బలపరీక్షకు ముందు కీలక పరిణామం..స్పీకర్ రాజీనామా

0
83

బిహార్​ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఏర్పడిన మహాగట్​ బంధన్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొనే ముందే అసెంబ్లీ స్పీకర్ విజయ్​ కుమార్​ సిన్హా​ రాజీనామా చేశారు. తనపై ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై ఆవేదన చెందారు. బలపరీక్షకు నేతృత్వం వహించాల్సిందిగా జేడీయూకు చెందిన నరేంద్ర నారాయణ్​ యాదవ్ పేరును సిన్హా సూచించారు. ​