మన దేశంలో రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటే వెంటనే చెబుతాం మనం పీఎన్ బీ అని…అంటే
పంజాబ్ నేషనల్ బ్యాంక్… తాజాగా ఈ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది… ఈరోజుల్లో ఏటీఎం మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ బ్యాంకు కస్టమర్లకు ఓ ఊరట కలిగించే వార్త చెప్పింది కొత్త రూల్ ని తీసుకువచ్చింది.
ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇక మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉంటే మీరు నగదు విత్ డ్రా చేసుకోవడానికి ఏటీఎంకి వెళితే.. నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్లలో నుంచి డబ్బులు తీసుకోవడం వీలు కాదు.
ఇక వచ్చే నెల నుంచి నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల ద్వారా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు నిలిపివేస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్వీట్ చేసింది.
ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఈ మధ్య మోసాలు పెరిగిపోవడం… అందుకే ఈ నిర్ణయ తీసుకుంది. దీని వల్ల మోసాలు జరగవు డేటా సురక్షితంగా ఉంటుంది.. అందుకే ఈ ప్రకటన చేసింది.. ఈ బ్యాంకు ఖాతాదారులు ఫిబ్రవరి 1 నుంచి నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల నుంచి డబ్బులు తీసుకోలేరు.