ఉచితంగా ఆ రైల్వేష్టేష‌న్ లో ఫ్లాట్ ఫామ్ టికెట్ ఎందుకంటే

ఉచితంగా ఆ రైల్వేష్టేష‌న్ లో ఫ్లాట్ ఫామ్ టికెట్ ఎందుకంటే

0
89

మ‌నం రైల్వే స్టేష‌న్ కు వెళితే క‌చ్చితంగా ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ తీసుకోవాల్సిందే , ఎక్క‌డా ఉచితంగా ఇవ్వ‌రు క‌దా… అయితే తాజాగా ఓ స్టేష‌న్ లో మాత్రం మీరు కాస్త ఫిట్ నెస్ యంత్రం ముందు వ్యాయామం చేస్తే చాలు మీకు ఫ్లాట్ ఫామ్ టికెట్ ఇస్తారు.

ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు వెళ్లినవారికి అక్కడో ఫిట్ నెస్ యంత్రం కనిపిస్తుంది.అక్క‌డ మీరు జ‌స్ట్15 నిమిషాలు వ్యాయామం చేయాలి అప్పుడు మీకు ఓ ఫ్లాట్ ఫామ్ టికెట్ ఉచితంగా ఇస్తుంది మిష‌న్..
ప్రజల్లో వ్యాయామం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడమే రైల్వే శాఖ ఈ మిషన్ ని ఏర్పాటు చేసింది.

ఇలా వ్యాయ‌మం చేసి కొంద‌రు ఈ టికెట్ పొంది సోష‌ల్ మీడియాలో కూడా పెడుతున్నారు,..రష్యాలో ఎప్పటినుంచో ఈ విధానం అమల్లో ఉంది. అక్కడ 30 సిటప్స్ చేస్తే టికెట్ ఫ్రీ. ఇక మ‌న దేశంలో ప్ర‌వేశ‌పెట్టిన దీనిపై రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.