‘ఈటల కాదు..మోడీ, అమిత్ షా వచ్చినా గజ్వేల్ లో గెలవలేరు’

0
103

తెలంగాణాలో రాజకీయం వేడెక్కింది. రోజురోజుకు పార్టీ బలపడడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈసారి గజ్వేల్ నుండి పోటీ చేస్తానని, సీఎం కేసీఆర్ ను ఓడించడమే నా లక్ష్యమని అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై FDC ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్పందించారు.

ఈటెల రాజేందర్ గజ్వేల్ లో కాదు మరోసారి హుజూరాబాద్ లో గెలిచి నీ ఉనికిని చాటుకో అని ఛాలెంజ్ చేశారు. గజ్వేల్ లో నీవు కాదు ప్రధాని నరేంద్ర మోడీ, మీ నాయకుడు అమిత్ షా, నడ్డ, వచ్చిన వారికి ఇక్కడ ఓటమి తప్పదని సవాల్ విసిరారు. గజ్వెల్ లో టీఆర్ఎస్ కండువా వేసుకున్న ఒక సామాన్య కార్యకర్తను కూడా ఈటెల రాజేందర్ ఓడించలేడన్నారు.

ఆస్తులను కాపాడు కొనేందుకు బిజెపి కండువా వేసుకున్నావు..నీ నియోజకవర్గానికి కేంద్రం నుండి తీసుకొచ్చిన నిధుల వివరాలు చెప్పగలవా ? అని నిలదీశారు హుజూరబాద్ లో నీకు ఓటమి భయం పట్టుకొని గజ్వేల్ లో పోటీ చేస్తా అని ప్రకటనలు చేస్తున్నావని సెటైర్లు పేల్చారు.