సబ్సిడీ గొర్రెలు వద్దు-నగదు బదిలీ ముద్దు..మంత్రి ఎర్రబెల్లికి మహబూబాబాద్ GMPS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి

0
105
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం దుర్వినియోగం పాలవుతుంది. ఈ నేపథ్యంలో “సబ్సిడీ గొర్రెలు వద్దు..నగదు బదిలీ ముద్దు” అనే నినాదంతో మహబూబాబాబాద్ GMPS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే & పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం వారు వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జియంపిఎస్ జిల్లా అధ్యక్షా, కార్యదర్శులు పయ్యావుల మల్లయ్య, బొల్లం అశోక్ లు మాట్లాడుతూ..రైతుబంధు, దళిత బంధు మాదిరిగా గొల్ల కురుమలకు నగదు బదిలీ చేసేలా అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. నగదు బదిలీ చేసినప్పుడు దళారుల ప్రమేయం ఉండదని తెలిపారు. లబ్ధిదారుల వాటా కట్టిన రోజునే ప్రభుత్వ సబ్సిడీ డబ్బులు అకౌంట్లో జమ చేసేలా విధివిధానాలు రూపొందించాలని, నిర్దిష్టంగా సమయం ప్రకటించి లబ్దిదారుల వాటా, ప్రభుత్వ వాటా ఒకేరోజు అందేలా చేయాలని కోరారు. మొదటి విడతలో జరిగిన గొర్రెల పంపిణీలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయని ఫలితంగా దళారులు, కొంతమంది పశువైద్యాధికారులు లాభపడ్డారని పేర్కొన్నారు.
నగదు బదిలీకై ప్రభుత్వంను ఒప్పించాలని వారిని కోరడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గొర్రెలకు బదులుగా నగదు బదులు ఇవ్వాలని, లేని యెడల రాష్ట్రంలో ఉన్నటువంటి కలుపుకొని ఈ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాల నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి ఎద్దు ఐలయ్య, టౌన్ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, వల్లపు మల్లయ్య, నిమ్మల ఐలయ్య, కంటాయపాలెం ఉప సర్పంచ్ గజ్జి రామ్మూర్తి, బోర స్వామి, గజ్జి యాకయ్య, కొండ లక్ష్మణ్, పెద్దబోయిన రామ్మూర్తి, మల్లేష్, వీరన్న, వల్లపు లింగయ్య, రాంబాబు, ఐలేను, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వినతిపత్రం అందజేస్తున్న GMPS నాయకులు
కలెక్టర్ శశాంకకు వినతిపత్రం అందజేత