కోమాలో ఉత్తర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ – సోద‌రి ఏం చేస్తోందంటే

-

ఉత్తర కొరియా పేరు చెప్ప‌గానే ఆ దేశ అధినేత నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ గుర్తు వ‌స్తారు, అయితే మార్చి నుంచి ఆయ‌న గురించి, ఆయ‌న ఆరోగ్యం గురించి అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి, ఆయ‌న ఆరోగ్యం బాగాలేదు అని అనేక అంత‌ర్జాతీయ వార్త‌లు వ‌చ్చాయి, అయితే ఈ క్రమంలోనే కిమ్ కోమాలోకి వెళ్లినట్లుగా మ‌ళ్లీ వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

కిమ్ సోదరి కిమ్ యో-జోంగ్ జాతీయ – అంతర్జాతీయ వ్యవహారాలను నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నట్లుగా దక్షిణ కొరియా అధికారి చెబుతున్నారు, అయితే అక్క‌డ దేశీయ మీడియాలు మాత్రం ఈ విష‌యం పై ఎలాంటి వార్త ఇవ్వ‌డం లేదు.

ఆయన కోమాలో ఉండడంతో ఉత్తర కొరియాలో ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చూస్తున్నారని దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్‌కు సహాయకుడిగా పనిచేసిన చాంగ్ సాంగ్ మిన్ తెలిపారు. అయితే నెల రోజుల నుంచి అబ్జ‌ర్వ్ చేస్తున్న గూడ‌చారులు కిమ్ కోమాలోకి వెళ్లారు అని తెలిపార‌ట‌, ఆయ‌న మ‌ర‌ణించ‌లేదు అని తెలుస్తోంది, అయితే కిమ్ సోద‌రి దేశ అధ్య‌క్ష బాధ్య‌‌త‌లు తీసుకోనున్నారు అని తెలుస్తోంది, దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌. కిమ్ కు సోద‌రి అంటే ఎంతో ఇష్టం.. అంతేకాదు ఆమెని మిన‌హా మ‌రెవ‌రిని త‌న కుటుంబంలో న‌మ్మ‌డు కిమ్. అందుకే ఆమెకే ప‌గ్గాలు ఇవ్వ‌నున్నార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...