నోరుజారిన పవన్ ఏపీలో రివర్స్ కౌంటర్స్

నోరుజారిన పవన్ ఏపీలో రివర్స్ కౌంటర్స్

0
89

దిశ ఘ‌ట‌ప‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ‌స్తుంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపాయి.
దీంతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు మండిపడతున్నారు. ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.

దిశపై అత్యాచారం చేసిన నిందితులను దేశమంతా కఠినంగా శిక్షించాలని అంటుంటే.. పవన్‌ కల్యాణ్‌ రెండు బెత్తం దెబ్బలు వేస్తే సరిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ప‌వ‌న్ కు అవ‌గాహ‌న లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆమె విమర్శించారు. ప్రజా నాయకుడిగా ఉండి పవన్ ఇలా మాట్లాడటం సరికాదు అని ఆమె విమర్శించారు.. మహిళలంటే పవన్‌కు ఎంత చులకనభావమో ఈ వ్యాఖ్యలను బట్టే అర్థమవుతోందన్నారు.

ఇక పవన్ కు అధికారం ఇస్తే మహిళలకు రక్షణ ఏం ఇస్తారు అని ఆమె ప్రశ్నించారు.
మహిళల రక్షణ కోసం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకురానున్నట్లు మంత్రి చెప్పారు. మొత్తానికి పవన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.