యూట్యూబ్ చానల్స్ వాళ్ళ వల్ల మీడియా విశ్వసనీయతకే ముప్పు ఏర్పడుతుందని మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యూట్యూబ్ లో పని చేసే వాళ్లంతా జర్నలిస్టులు కారని, వారికి ఏ గుర్తింపు ప్రాతిపదిక లేదని అన్నారు.
అయితే యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న జర్నలిస్ట్ మిత్రులకు అండగా APWJU (ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనిటీ ) తోడుగా ఉంటుంది. పెద్ద పెద్ద అని చెప్పుకుంటున్న ఛానెల్స్ వారు కూడా యూట్యూబ్ టెలికాస్టింగ్ మీద ఆధారపడి ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్ల పై జరుగుతున్నా దాడిపై ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనిటీ (APWJU)చైర్మన్ శివ శంకర్. చలువాది ,సెక్రటరీ మహ్మద్ రజాక్, వైస్ చైర్మన్ పణితి రత్న కుమార్ మాట్లాడుతూ..గత కొద్ది కాలంగా యూట్యూబ్ ఛానల్స్ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వెబ్ సైట్స్ ప్రాచుర్యం పొందుతుంది. ప్రస్తుతం ఇండియాలో పెద్ద పెద్ద ఛానల్స్ తమ కంపెనీకి సంబంధించి వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీదే ఆధారపడి వ్యూస్ పెంచుకుంటున్నాయి. ఈ దశలో యూట్యూబ్ ఛానల్స్ లో పని చేసే వాళ్లంతా జర్నలిస్టులు కారు అని వస్తున్న వార్తలు కేవలం కొంతమంది ఛానల్స్ రిపోర్టర్లకు యూట్యూబ్ ఛానల్స్ రిపోర్టర్లు వారి ఆర్థిక ఆదాయాలకు, అధిపత్యానికి అడ్డంకులుగా మారడం వల్లే ఈ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టారు. కొన్ని ఛానల్స్ ప్రతినిధులు, రిపోర్టర్లు కూటమిగా ఏర్పడి రాజకీయ నాయకుల అవినీతి అక్రమార్కులకు అండగా నిలబడుతూ వారి అవినీతి అక్రమాలు వెలుగులోకి రాకుండా దోహద పడుతుండడాన్ని యూట్యూబ్ ఛానల్స్ రిపోర్టర్లు గండి కొట్టడం వల్లే యూట్యూబ్ ఛానల్స్ రిపోర్టర్ల పై గుర్రుగా ఉంటున్నారు.
గతంలో మాదిరిగా అవినీతి అక్రమాలను తొక్కిపెట్టి వార్తలను వెలుగులోకి రాకుండా చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. యూట్యూబ్ ఛానల్స్ వల్లనే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత వరకు ఇండియాలో యూట్యూబ్ ఛానల్ గానీ, వెబ్ సైట్లను కానీ నిషేధించినట్లు అధికారిక జి.ఓ గానీ ప్రభుత్వ ప్రకటన కానీ లేదు. తమకు అడ్డుగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ రిపోర్టర్లను భయపెట్టడానికే కొంతమంది ఛానల్ రిపోర్టర్లు నకిలీ విలేకరులు అనే పేరుతో లేదా యూట్యూబ్ లో పని చేసే వాళ్లంతా జర్నలిస్టులు కారని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిసింది.
అయితే ఈ ఫిర్యాదులపై బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడనంత వరకు యూట్యూబ్ ఛానల్స్ రిపోర్టర్లు భయపడాల్సిన అవసరం లేదు. ఏదయినా కంపెనీ మీకు ఇచ్చిన గుర్తింపు కార్డుతో న్యూస్ కవరేజీ కోసం వెళ్ళవచ్చు. ఎలాంటి ప్రభుత్వ, పోలీసు అనుమతి అవసరం లేదని రాజ్యాంగం కల్పించిన సమాచార సేకరణ హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి కలదని గుర్తించగలరని తెలియచేస్తున్నాం అన్నారు.
అల్లం నారాయణ కామెంట్స్..
అసలు రాజ్యాంగంలో ప్రత్యేకమైన స్వేచ్ఛ అంటూ లేదు. భావ ప్రకటన పేరుతో కంట్లో పొడుస్తా
అంటే ఎలా.? యూట్యూబ్ చానల్స్ వాళ్ళ వల్ల మీడియా విశ్వసనీయతకే ముప్పు ఏర్పడుతుంది. నిజమైన జర్నలిస్టులు తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారు వాస్తవాలను వెలికి తీయడం లేకపోతున్నారు. యూట్యూబ్ రిపోర్టర్లు, వెబ్ పేపర్ రిపోర్టర్లు, పీడీఎఫ్ పేపర్స్ రిపోర్టర్లు ఎట్టి పరిస్థితిలో జర్నలిస్టులు కారు వారికి ఎలాంటి క్రెడిబిలిటి లేదు అలాంటి వారిని ప్రోత్సహించకండి.