ఇక నుంచి ఏటీఎమ్ లకు వెళ్లాల్సిన అవసరంలేదు…

ఇక నుంచి ఏటీఎమ్ లకు వెళ్లాల్సిన అవసరంలేదు...

0
82

కరోనా వైరస్ ను అరికట్టేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే… దీంతో ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు…. అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు కావాల్సిన నిత్యవసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తోంది… అయితే వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి…

డబ్బులు కావాలంటే ఏటీఎమ్ లకు వెళ్లాల్సిన పనిస్థితి…. అయితే ఇక నుంచి ప్రజలు ఎటీఎమ్ లకు వెళ్లాల్సిన అవసరంలేదు… కస్టమర్లకు డబ్బులను కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు… డోర్ డెలివరీ చేస్తే వంద రుపాయలుచార్జ్ చేస్తున్నారు…

లాక్ డౌన్ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా, ఐసీఐసీఐ, కొటక్ మహేంద్ర బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ, యాక్సస్ బ్యాంకులు కస్టమర్లకు డబ్బులను ఇంటికి పంపిస్తున్నారు… రోజుకు 5 వేల నుంచి 25 వేల వరకు మాత్రమే క్యాష్ అందిస్తుంది… ఇందుకు వందనుంచి 2 వందలు చార్జీలు చెల్లించాల్సి ఉంది… అత్యవసర డబ్బులు కావాల్సి వస్తే బ్యాంకును సంప్రదించవచ్చు… ఎమర్జెన్సీ సమయంలో ఏ కస్టమర్ అయినా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు