ఏపీలో జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెబుతోంది …అంగన్వాడీ పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా పగో జిల్లాలో ఈ పోస్టులకి సంబంధించి వివరాలు చూద్దాం
1..అంగన్వాడీ వర్కర్
2.., మినీ అంగన్వాడీ వర్కర్
3.., అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది
ఇక ఈ ఖాళీలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ భర్తీ చేస్తోంది. మొత్తం జిల్లాలో 183 పోస్టులు ఉన్నాయి,
వీటిలో అంగన్వాడీ వర్కర్-19
మినీ అంగన్వాడీ వర్కర్-4
అంగన్వాడీ హెల్పర్-160 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు
మరి అర్హతలు చూస్తే
కచ్చితంగా పది తరగతి పాస్ అవ్వాలి
వివరాలు http://www.westgodavari.org/ వెబ్సైట్లో Recruitment సెక్షన్లో తెలుసుకోవచ్చు
మరి దరఖాస్తు ఎప్పుడు వరకూ అంటే 2020 అక్టోబర్ 11నప్రారంభమై అక్టోబర్ 20 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి.
వయస్సు 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వివాహం అయిన మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.
అప్లై చేసే చోట పంచాయతీ గ్రామాల్లో నివాసం ఉన్నవారు అప్లై చేసుకోవాలి.