ఎక్కడైనా పోలీసులు జనాలను ఉరికిస్తరు. బెదిరిస్తరు. కొడ్తరు. తిడ్తరు. లాస్టుకు సావగొడ్తరు. కానీ ఇక్కడ పోలీసోళ్లను ఉరుకులపెట్టించిండు కాంగ్రెస్ లీడర్. ఎక్కడ ఏందనుకుంటున్నరా? చదవండి. వీడియో కూడా చూడండి.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ ఎఐసిసి పిలుపు మేరకు హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు కదం తొక్కారు. ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు. భారీగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సమయంలో ఎలాగైనా రాజ్ భవన్ ను టచ్ చేయాలనుకున్నాడు ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్. యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నడు.
ఇక రాజ్ భవన్ ముంగిట వరకు పోలీసులు కండ్లు గప్పి వచ్చిండు. అప్పుడు ఉరుకుడు స్టార్ట్ చేసిండు. ఆయనను దొరికించుకునేందుకు పోలీసులు ఉరకలేక ఆగమైన్రు. లాస్టుకు రాజ్ భవన్ గేటు దగ్గర బల్మూరి వెంకట్ ను అరెస్టు చేసి స్టేషన్ కు పట్కపోయిర్రు. మొత్తానికి నిద్రపోయి నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఇయ్యాల తడాఖా చూపినట్లు కనబడ్డది. భవిష్యత్తుల ఏం చేస్తరో చూడాలె.