ఇది అబ్జ‌ర్వ్ చేశారా క‌రోనా కాల‌ర్ టోన్ మారింది

0

మ‌న దేశంలో 2020 మార్చి నుంచి క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి, ఈ స‌మ‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తెలిపింది కేంద్రం,కరోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఆ వైర‌స్ పై అవ‌గాహ‌న కల్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం కాల‌ర్ టోన్ ను కూడా తీసుకువ‌చ్చింది, ఫోన్ చేసే ప్ర‌తీ ఒక్క‌రు అది వినేవారు.. చాలా వ‌ర‌కూ మాస్క్ శానిటైజ‌ర్ ఎంత అవ‌స‌ర‌మో అదే తెలిపింది.

ఇలా జాగ్ర‌త్త‌లు తీసుకుని చేతులు శుభ్రం చేసుకున్నారు శానిటైజ‌ర్ రాసుకున్నారు,
మ‌నం పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగితో కాద‌ని సందేశం ఇచ్చేవారు. తాజాగా మ‌న దేశంలో వ్యాక్సిన్ వ‌చ్చేసింది, ఇక ఈ కాల‌ర్ టోన్ మారింది.

ఇప్పుడు కొత్త కాల‌ర్ టోన్ విన‌ప‌డుతోంది. దేశంలో రూపొందించిన వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితమైనదని అందులో చెబుతున్నారు, వైరస్‌ను ఎదుర్కొనే శక్తిని వ్యాక్సిన్ అందిస్తుందని అందులో చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో క‌రోనా‌ కాల్‌ సెంటర్లను సంప్రదించాలని తెలియ‌చేస్తున్నారు, ఈ ప్ర‌చారం బాగుంది అంటున్నారు జ‌నం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here