అక్టోబర్ 17 నుంచి దసరా మహోత్సవాలు- అలంకరణలు – కొత్త రూల్స్ ఇవే

అక్టోబర్ 17 నుంచి దసరా మహోత్సవాలు- అలంకరణలు - కొత్త రూల్స్ ఇవే

0
102

దసరా వచ్చింటి అంటే అమ్మవారి ఆలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.. ఇక విజయవాడ కనక దుర్గమ్మ ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు, అయితే
అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి… 9 రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది భక్తులకి.

అయితే కరోనా సమయం కాబట్టీ పెద్ద ఎత్తున భక్తులని ఇక్కడ అనుమతించరు అని తెలుస్తోంది, అంతేకాదు ఇక టైమ్ స్లాట్ ప్రకారం టికెట్ తీసుకునే వారికి దర్శనం కల్పించే అవకాశం ఉంది, ఇక 8 నుంచి 9 వేల మంది భక్తులని మాత్రమే అనుమతించే అవకాశం ఉంది అంటున్నారు, అయితే ఇంకా ఎలాంటి నిర్ణయాలు దీనిపై తీసుకోలేదు. త్వరలో దీనిపై ఓ కీలక ప్రకటన అయితే రానుంది.

అక్టోబర్ 17న తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
19న శ్రీ గాయత్రీ దేవి
20 న శ్రీ అన్నపూర్ణాదేవి
21 న మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి
22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
23 న శ్రీ మహాలక్ష్మీ దేవి
24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషాసురమర్ధనీ దేవిగా రెండు అలంకారాలు
25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం.