ఆఫీసుల్లో ఇలా చేయద్దు వైరస్ ఇంకా విజృంభిస్తుంది

ఆఫీసుల్లో ఇలా చేయద్దు వైరస్ ఇంకా విజృంభిస్తుంది

0
95

ఈ వైరస్ వేళ అతి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ,ఈ కరోనా కష్టకాలంలో ముప్పు మాత్రం పొంచి ఉంది అంటున్నారు నిపుణులు, ఇక కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా ఆఫీసులు తెరచుకున్నాయి, ఈ సమయంలో ఉద్యోగులు ఆఫీసులకి నెమ్మదిగా వస్తున్నారు, అయితే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కరోనా వైరస్ ముప్పు పొంచి ఉందని జాగ్రత్తలు తీసుకోవాలి అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

పని ప్రదేశాల్లో ఉద్యోగులు ఎదురెదురుగా కూర్చొవద్దని . . డెస్కులు, కుర్చీలు జిగ్ జాగ్ విధానంలో అమర్చాలని, మొబైల్ ఫోన్లను, డెస్కులను, ఇతర వస్తువులను వాడద్దు అని చెబుతున్నారు, భౌతిక దూరం మాస్క్ కచ్చితంగా వాడాలి పాటించాలి.. సబ్బుతో చేతులను సుమారు 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బు లేనిపక్షంలో శానిటైజర్ ఉపయోగించుకోవాలి.

ఎవరికి అయినా ఈ లక్షణాలు కనిపిస్తే ఆఫీసుకి రాకుండా చెకప్ కు వెళ్లాలి, టిష్యూలు – రుమాలు కచ్చితంగా వాడాలి, సాధ్యమైనంత వరకు సెంట్రలైజ్డ్ ఏసీని వినియోగించకపోవడమే బెటర్. అందరూ ఒకే సారి గేటు నుంచి రాకుండా చూడాలి, గ్రూపులుగా భోజనాలు చేయకుండా ఉండాలి, ఇక వైరస్ పాజిటీవ్ వచ్చి చికిత్సకు వెళితే వారికి నెగిటీవ్ వచ్చే వరకూ అనుమతి వద్దు అని తెలిపారు. ఇక లిఫ్ట్ కాకుండా మెట్ల మార్గంలో వెళితే ఉత్తమం అంటున్నారు నిపుణులు.