ఒక్క బర్త్ డే పార్టీ ? 25 మందికి కరోనా ? సంచలన నిర్ణయం

ఒక్క బర్త్ డే పార్టీ ? 25 మందికి కరోనా ? సంచలన నిర్ణయం

0
78

ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ఎక్కడ ఉన్న వారు అక్కడ ఉంటే కొద్ది రోజుల్లో ఈ వైరస్ ని నివారించగలం అని, కాని కొందరు దీనిని ఈజీగా తీసుకుంటున్నారు.. చివరకు చిక్కుల్లో పడుతున్నారు, బర్త్ డే వేడుకలు పెళ్లి ఫంక్షన్లు అన్నీంటికి దూరంగా ఉండాలి అని కోరుతున్నారు, కాని కొందరు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

తాజాగా హైదరాబాదులోని ఓ అపార్ట్ మెంట్ లో 25 మందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో, జీహెచ్ఎంసీ అధికారులు ఆ ఏరియాని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. మాదన్నపేటలో ఉన్న ఆ అపార్ట్ మెంట్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇటీవల అక్కడ ఓ పుట్టిన రోజు వేడుక జరిగింది.

ఈ సమయంలో పార్టీ నిర్వహించారు, దీంతో అక్కడకు వచ్చిన 25 మందికి వైరస్ పాజిటీవ్ వచ్చింది, దీంతో ఇప్పుడు వీరు ఎవరిని కలిశారు, అనేదానిపై పూర్తిగా అన్నీ తెలుసుకుంటున్నారు, ఇలా 25 మంది అపార్ట్ మెంట్ వాసులకి వైరస్ పాజిటీవ్ రావడంతో, వారిని గాంధీకి తరలించారు, అందుకే ఎక్కడ ఫంక్షన్లకు హజరుకాకండి. స్టేహోమ్.