మన దేశంపై కరోనా పంజా విసిరింది అనే చెప్పాలి, ఇప్పటికే 42 వేల కేసులు నమోదు అయ్యాయి, ఇక కొన్ని ఈశాన్య రాష్ట్రాలు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా బాగానే నిలువరించాయి అని చెప్పాలి, అయితే ఎంతో అప్రమత్తంగా ఉన్న స్టేట్ అస్సోం, కాని తాజాగా అక్కడ అసోంను ఇప్పుడో కొత్త సమస్య వేధిస్తోంది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పందుల్లో అత్యంత ప్రమాదకర అంటువ్యాధి అయిన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది.
దీంతో అక్కడ ప్రజలు భయపడుతున్నారు.. ఇక్కడ ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో 2,500కు పైగా పందులు మృత్యువాత పడ్డాయి, ఇక ఎవరూ కూడా ఈ మాంసం తినేందుకు ముందుకు రావడం లేదు, ఇక ఈ వ్యాధి తగ్గాలి అంటే వెంటనే ఆపందులని చంపెయ్యాలి అని చాలా మంది పెంచుకుంటున్న వాటిని చంపేస్తున్నారు.
పందుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షిస్తామని అధికారులు తెలిపారు, వ్యాధి లక్షణాలున్న వాటిని మాత్రమే సంహరిస్తామని తెలిపారు అధికారులు. దీని వల్ల ప్రజలకు ఇబ్బంది ఉండదు అని తెలిపారు, అయితే ఇక్కడ వ్యాధి ఉంది కాబట్టి ఈ పందులు ఎవరూ తినద్దు అని చెబుతున్నారు అధికారులు.