దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలను ఒమిక్రాన్ కలవరపెడుతుంది. తాజాగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది.
ఇటీవల దుబాయ్ నుండి తన గ్రామం ముస్తాబాద్ మండలం గూడెం వచ్చిన ఓ వ్యక్తికి ఓమిక్రాన్ నిర్దారించారు. తాజాగా అతని తల్లి, భార్యకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారించారు. దీంతో గ్రామస్థులు 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించుకున్నారు.
గ్రామంలో ఉన్న ప్రజలు బయటకు వెళ్లవద్దని, బయటివారు గూడెంకు రావద్దని నిర్ణయించారు. బాధితుడు ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపురం లో ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న 53 మంది నమూనాలు సేకరించి, వారిని ఇళ్ళ నుంచి బయటకు రావద్దని ఆదేశించారు వైద్యాధికారులు.