ఒమిక్రాన్ ప్రకంపనలు..కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..!

Omicron vibrations..the chance of making a crucial decision ..!

0
82

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం – కేంద్ర ఆరోగ్యశాఖతో కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది.

ఈ నెల 27న (సోమవారం) కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో జరగబోయే సమావేశంలో దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. అలాగే, యూపీ, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.