మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తెలుగు రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఉంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు సామాన్యుడు విలవిలలాడుతుంటే..అది చాలదా అంటూ మరోసారి ఇందన ధరలు పెంపు అంటూ చమురు సంస్థలు ప్రకటించాయి. దీనితో సామాన్య ప్రజలపై మోయలేని భారం పడనుంది.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర 26 పైసలు పెరిగి రూ.97.43 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్ ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది. వైజాగ్‌లో లీటర్ డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.97.90 వద్దకు చేరింది. పెట్రోల్ ధర రూ.106.23గా ఉంది. గుంటూరులో డీజిల్ లీటర్‌పై 25 పైసలు పెరిగి రూ.99.13 వద్దకు చేరింది. పెట్రోల్ ధర లీటర్ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. పెరిగిన ధరలతో సామాన్యులు వాహనాలతో రోడ్డెక్కే పరిస్థితి కనపడడం లేదు.