ఒకటో తేది వచ్చింది అంటే గ్యాస్ ధర పెరుగుతుందా తగ్గుతుందా అని దేశంలో అందరూ ఎదురుచూస్తు ఉంటారు, మరీ ముఖ్యంగా అందరూ ఈ రేటు గురించి ఆలోచిస్తూ ఉంటారు.. అయితే తాజాగా ఇప్పుడు గ్యాస్ ధర మరోసారి పెరిగింది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర మరోసారి పెరిగింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. అలాగే 5 కిలోల చిన్న సిలిండర్ ధర రూ.18 పెరిగింది.
ఇక కమర్షియల్ కు వాడే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.36.50 పెరిగింది. ఇక ఈ నెల సాధారణంగా డిసెంబర్ 2న
గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. 15 రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి 50 పెరిగింది ఇలా రూ.100 పెరగడం
రికార్డు అనే అంటున్నారు.
14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.644
కోల్కతాలో రూ.670.50
ముంబైలో రూ. 644
చెన్నైలో రూ.660
మన దేశంలో గ్యాస్ వినియోగధారులకి ఏడాదికి 12 చొప్పున గ్యాస్ సిలిండర్లను సబ్సిడీకి ఇస్తుంది ప్రభుత్వం.