హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఆయన వరంగల్ పర్యటనకు వెళ్తున్నట్లు ప్రకటించడంతో రేవంత్‌ను గృహనిర్బంధం చేశారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొండపల్లి దయాసాగర్ తండ్రి దశదిన కర్మకు రేవంత్ రెడ్డి వెళ్లడంతో పాటు.. ఇటీవల శబరిమలలో చనిపోయిన కాంగ్రెస్ నాయకుడు చరణ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వరంగల్ వెళ్లనున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఇవాళ వరంగల్ శివార్లలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని అంతకుముందు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే.. డిసెంబర్ 31న అని పోలీసులు రచ్చబండ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. వరంగల్ వెళ్తానని ప్రకటించిన రేవంత్… రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్న అనుమానంతో పోలీసులు రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో గృహనిర్బంధం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నులో వణుకుపుడుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. తాము ఇంట్లో నుంచి కాలు కదిపితే గజగజ వణికిపోతున్నారని తెలిపారు. ప్రజాగ్రహం పెల్లుబికిన రోజు.. కేసీఆర్ ఫాంహౌజ్, ప్రగతిభవన్‌లు బద్ధలైపోతాయని హెచ్చరించారు. రైతులు చనిపోతుంటే.. వారి కుటుంబాలను పరామర్శించడం తప్పా అని ప్రశ్నించారు.
– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు