ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు – ల్యాప్ టాప్ – విద్యార్దుల‌కి బంప‌ర్ ఆఫ‌ర్

ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు - ల్యాప్ టాప్ - విద్యార్దుల‌కి బంప‌ర్ ఆఫ‌ర్

0
107

విద్యార్దుల‌కు కొన్ని రాష్ట్రాలు మంచి ప్రోత్సాహ‌కాలు అందిస్తాయి, ప్ర‌తిభా పుర‌స్కారాలు అందిస్తాయి.
తాజాగా 10వ, 12వ తరగతి విద్యార్థులకు యూపీ సర్కారు బంపర్ ఆఫర్ ఇచ్చింది..
డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ మాట్లాడారు .. పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ.లక్ష నగదుతోపాటు, ల్యాప్‌టాప్‌లను ప్రోత్సాహక బహుమతులుగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

దీంతో యూపీలో స‌ర్కారు విద్యార్దుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన‌ట్లు అయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచన మేరకే తాము ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలని నిర్ణయించామని యూపీ డిప్యూటీ సీఎం చెప్పారు.

అంతేకాదు ఆ విద్యార్దుల‌కు న‌గ‌దు లాప్ టాప్ తో పాటు ఆ గ్రామంలోగానీ, పట్టణంలోగానీ వారి ఇంటివరకు పక్కా రోడ్డును నిర్మిస్తామని తెలిపారు. ఇక దీంతో మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ ఆలోచ‌న బాగుంది అని అంటున్నాయి.