ఏపీలో కొనసాగుతున్న వైఎస్సార్‌ పింఛన్ల పంపిణీ

Ongoing distribution of YSSAR‌ pensions in AP

0
207

ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కొనసాగుతోంది. 2.66 లక్షల మంది వాలంటీర్లు సోమవారం తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులకు వద్దకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. ఈ నెల మొత్తం 60,65,526 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 1417.53 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటల వరకు 46.69 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయ్యింది.

ఈ నెల మొత్తం 60,65,526 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందనున్నాయి. ఇందుకోసం 1417.53 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా లబ్దిదారులకు ఇంటింటి తిరిగి వాలంటీర్లు పెన్షన్లను ప్రతి నెల 1వ తేదిన లబ్దిదారులకు అందజేస్తున్నారు. ఇంటివద్ద అందుబాటులో లేని వారు మాత్రమే పెన్షన్‌ను అందుకోలేకపోతున్నారు.

వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాల వల్ల సొంతూరులో కాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న లబ్దిదారులు ఎక్కడైనా పెన్షన్‌ను అందుకునేలా ఇటీవల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్దిదారులందరికీ పెన్షన్‌ అందిచాలనే లక్ష్యంతో జగన్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.