తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు ఎండ, వానని సైతం లెక్కచేయకుండా గత రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ సందర్శించి తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు స్పష్టమైన హామీ లభించే వరకు తగ్గేదే లేదంటున్నారు.
విద్యార్థుల నిరసన విరమింపజేసేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు శనివారమంతా శాయశక్తులా చేసిన ప్రయత్నం విఫలమైంది. మరోవైపు విధుల్లో అలసత్వం ప్రదర్శించి, సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు విద్యాలయ ఏవో రాజేశ్వర్‌రావును విధుల నుంచి తొలగించారు. అనంతరం విద్యార్థులతో చర్చలు విజయవంతమయ్యాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు.
కానీ అదే సమయంలో వర్షంలోనూ విద్యార్థులు ఆందోళన చేయడంపై విలేకరులు ప్రశ్నించగా… తమ వద్ద ఆందోళన విరమిస్తామని విద్యార్థులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఓ వీడియో విడుదల చేసిన విద్యార్థులు..సీఎం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ నిరసనలు చేస్తామన్నారు.