గత ఏడాది ఉల్లి ధరలు చుక్కలని అంటాయి, అయితే ఈసారి కూడా వర్షాభావ పరిస్దితులతో ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి, ఏకంగా హోల్ సెల్ మార్కెట్ లోనే 70 రూపాయలు ఉంది ..ఇక రవాణాతో ఇది 90 రిటైలర్ కు వస్తోంది, ఇక మార్కెట్లో 100 నుంచి 110
రూపాయలకు ఉల్లి అమ్ముతున్నారు.
భారీగా పెరిగిన ఉల్లి ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్య ప్రజలు..ఉల్లి లేకుండానే వంటలు వండుకునే పరిస్థితి కూడా వచ్చింది. కొన్ని స్టేట్స్ ఉల్లిని తక్కువ ధరలు రైతు బజార్లు ద్వారా అమ్ముతున్నారు, ఏపీ ప్రభుత్వం ఉల్లి ధరలు భారీగా పెరిగిపోయిన వేళ గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్రంలోని రైతు బజార్లు ప్రధాన నగరాలు పట్టణాలలో ఉల్లి ని సబ్సిడీ కింద అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోల్సేల్ మార్కెట్ లో ఉల్లి కొనుగోలు చేసి కిలో 40 రూపాయలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు, ఈనిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.